చంద్రబాబు పడవ ప్రమాదం వెనుక విజయసాయి రెడ్డి..ట్వీట్ వైరల్ !

-

రెండు రోజుల కిందట, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బయటపడ్డారు. రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా, నీటిలో ఆకస్మత్తుగా అందరూ నీటిలో పడిపోయారు. ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబు సహా 15 మంది ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదం వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని టీడీపీ ఓ వాదన వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ను గమనిస్తే అదే నిజమని తేలుతుందని టీడీపీ అంటోంది.  ఇది ఇలా ఉండగా..

వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామం. కాలం మీ పాపాలను మరుగుపరిచినా…కర్మ వదలదు…అది వెంటాడుతూనే ఉంటుంది చంద్రబాబు! అంటూ వివాదస్పద ట్వీట్‌ చేశారు. అలాగే ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ.? పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా? ఎల్లో మీడియా లైవ్ కవరేజి కోసమే కదా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్లను బేస్‌ చేసుకుని ఇప్పుడు టీడీపీ తమ వాదనను వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version