ఏం కేసీఆర్… ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ? – విజయశాంతి

-

కేసీఆర్‌ సర్కార్‌ పై విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పని ప్రారంభం చేసిందంటే దానిని దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు క్యూ కడుతుంటరు. కానీ సూర్యాపేట జిల్లాలో పరిస్థితి పూర్తిగా ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోందన్నారు. బిల్లుల చెల్లింపులో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విమర్శించారు.

ఇప్పటికే రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కొత్త పనులకు కనీసం టెండర్లు కూడా వేయడం లేదు. బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తమని ఆఫీసర్లు హామీ ఇస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి సుమారు రూ.50 కోట్లు రావాల్సి ఉంది. దీంతో పెండింగ్ బిల్స్‌ అన్నీ క్లియర్‌ చేస్తేనే కొత్తగా పనులు చేస్తమని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నరన్నారు.

దీంతో జిల్లావ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు పెండింగ్‌లో పడుతున్నయి. ఇది ఒక్క సూర్యాపేట జిల్లాకే పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏం కేసీఆర్… ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ? ఇప్పటికైనా వారి పెండింగ్ బిల్లును రిలీజ్ చెయ్. తెలంగాణను ఆగం చేస్తున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు త్వరలో ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అని హెచ్చరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news