జాతీయ పార్టీగా అవతరించిన భారత్ రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ ని ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సభకి దాదాపు 5 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరై విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, పలువురు జాతీయ నేతలు ఈ సభకి హాజరుకానున్నారు.
అయితే ఈ సభపై బిజెపి నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశంలోనే అత్యంత అవినీతిపరులైన సీఎం కేసీఆర్ గారికి… వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకునేవారు మద్దతిచ్చి, నేటి ఖమ్మం సభలో ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో వారికే తెలియాలి. అయినా ఈ లిక్కర్ స్కాంల, లిక్కర్ స్కీంల తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కమ్యూనిస్ట్‌లు ఎందుకో అవసరం లేని సయోధ్య, తమ సిద్ధాంతాలకు దూరమై కనపరుస్తున్నారని అనిపిస్తున్నది”. అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు విజయశాంతి.