విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలహీనంగా కనబడుతుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ తెలుగుదేశం పార్టీ ప్రభావం కాస్తోకూస్తో కనబడిన సరే ఆ పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు పార్టీలో ఉండడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో కొంతమంది నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మూడు నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్టీ మారిపోయే అవకాశం కనపడుతుంది.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని త్వరలోనే పార్టీ మారవచ్చని అంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే వాళ్లు పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మూడు నియోజకవర్గాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇక కొంతమంది నేతలు బీజేపీ వైపు కూడా చూస్తున్నారనే వార్తలు వినిపించాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి కారణంగా వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్లకపోవచ్చు అనే భావన ఉంది. వచ్చేవారం దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.