తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా వికాస్ రాజ్ నియ‌మకం

-

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా రాష్ట్ర సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ప్ర‌స్తుతం వికాస్ రాజ్ తెలంగాణ రాష్ట్ర సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. కాగ బుధ వారం వికాస్ రాజ్ ను రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిగా వ్య‌వ‌హ‌రించిన శ‌శాంక్ గోయ‌ల్ ఈ మ‌ధ్య కాలంలోనే బ‌దిలీ అయ్యారు.

ఆయ‌న స్థానంలోనే వికాస్ రాజ్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. కాగ వికాస్ రాజ్.. తెలంగాణ కేడ‌ర్ కు చెందిన ఐఏఎస్. వికాస్ రాజ్ 1992 వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. కాగ గ‌తంలో వికాస్ రాజ్.. ఉమ్మడి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌ర్నూల్ జిల్లాలో జాయింట్ క‌లెక్ట‌ర్, క‌లెక్ట‌ర్ తో పాటు ప‌లు హోదాల్లో ప‌ని చేశారు. కాగ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత.. వికాస్ రాజ్ ను తెలంగాణ క్యాడ‌ర్ గా కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news