యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ప్రజెంట్ ‘విక్రమ్’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ తో లోకేశ్ తీసిన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. అతి తక్కువ సమయంలోనే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ పిక్చర్..ప్రస్తుతం రికార్డుల వేటలో తలమునకలైంది.
విశ్వనటుడు కమల్ హాసన్ ను వెండితెరపైన ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించావంటూ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా విజయాన్ని కమల్ హాసన్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే.. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన ఈ మూవీ.. ఓటీటీలో నేడు విడుదల కాబోతుంది. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీపీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ఈరోజు ఉదయం 12 గంటల నుంచి ప్రసారంలోకి వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ నువ్వు మళ్ళీ ఓసారి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఓటిటిలో ఇంకో రౌండ్ వేయవచ్చు.