తెలుగు విశ్వవిద్యాలయం 20 కొత్త కోర్సులు

-

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సాహితీ పురస్కారాలను అందజేసింది. తెలుగు వర్సిటీలోని నందమూరి తారక రామారావు కళా మందిరంలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధాన సభలో పది మంది ఉత్తమ గ్రంథ రచయితలకు రూ.20,116 నగదు పారితోషికంతో సత్కరించింది తెలుగు వర్సటీ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌ రావు మాట్లాడుతూ… తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిరాడంబర రచయితలకు 2019 సాహితీ పురస్కారాలను అందించడానికి విశ్వవిద్యాలయం ఎంతో గర్వపడుతోందని వ్యాఖ్యానించారు.

Potti Sreeramulu Telugu University Admission 2022 99EntranceExam

అందుకు సహకరించిన పురస్కారాల నిర్ణాయక సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆచార్య తంగెడ కిషన్‌ రావు. వర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో 20 కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆచార్య తంగెడ కిషన్‌ రావు వెల్లడించారు. అలాగే వచ్చే రెండు మాసాల్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఆచార్య తంగెడ కిషన్‌ రావు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య ఆర్‌.లింబాద్రి మాట్లాడుతూ… సామాజిక మనుగడకు ఆయా ప్రాంతాల సాహిత్య, సంస్కృతి ప్రధాన భూమిక వహిస్తుందని, ఆ దిశగా తెలుగు విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతతో సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేశారు ఆర్‌.లింబాద్రి.

 

Read more RELATED
Recommended to you

Latest news