‘విమానం’ సినిమా నుంచి రిలీజైన కొత్త పోస్ట‌ర్స్‌!

-

శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌ – కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేట్ వ‌ర్క్స్ సంయుక్తంగా ఈ ‘విమానం’ను నిర్మిస్తున్నాయి. జూన్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై, గ్లింప్స్‌ .. ‘సిన్నోడా ఓ సిన్నోడా’ సాంగ్ ప్రోమో ఆస‌క్తిని పెంచాయి. స‌ముద్రఖ‌ని న‌టిస్తోన్న ద్విభాషా ఈ చిత్రం లో వీర‌య్య పాత్ర‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేసిన ద‌ర్శ‌క నిర్మాతలు, సినిమాలోని ఇత‌ర పాత్ర‌ధారుల‌ను ప‌రిచయం చేయ‌ట‌మే కాకుండా ఆ పాత్ర‌ల పేర్ల‌ను కూడా ఆడియన్స్‌కు ఇంట్ర‌డ్యూస్ చేశారు.వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్రఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు.

Vimanam New Posters Released

‘విమానం’ ప్ర‌ధానంగా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేసే సినిమా ఇది. ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ కొర్ర‌పాటి మాట్లాడుతూ… ‘‘డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు పెద్ద పీట వేస్తున్న మన ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ‘విమానం’ సినిమాను రూపొందిస్తున్నాం. జూన్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సినిమాలో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న అన‌సూయ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్రన్ పాత్ర‌ల‌కు పోస్ట‌ర్స్‌ను రిలీజ్ చేశాం. మంగ‌ళ‌వారం సినిమా నుంచి ‘సిన్నోడా ఓ సిన్నోడా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేయ‌బోతున్నాం. అంతే కాకుండా ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్ర‌యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బ‌హుమతుల‌ను కూడా అందిస్తాం’’ అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news