కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల అధికారులు వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సమావేశం నిర్వహించింది. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల అధికారులు వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. వీసీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఈవో వికాస్ రాజ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు పలుశాఖ అధికారులు హాజరయ్యారు. కర్ణాటకల ఎన్నికలకు సరిహద్దు రాష్ట్రాలు సహకారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.
ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం, డబ్బులు, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు పెంచాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించారు. కర్ణాటకతో ఉన్న సరిహద్దు జిల్లాలపై నిఘా వేయాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్‌శాఖల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు పెంచనున్నట్లు డీజీపీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఈవో ముఖేష్ కుమార్ మీనా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్నికలకు తెలంగాణ తరఫున అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎస్ శాంతికుమారి హామీ ఇచ్చారు.