Viral news: పవన్ అభిమాని ఆలోచన అదిరింది..జనసైనికులు ఫిధా..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినీ,రాజకీయాలలో ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.. ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యూత్ ఫాలోయింగ్ ఎలా వుందో ఈ మధ్య జరుగుతున్న వేడుకలను చూస్తే తెలుస్తుంది.పవన్ అభిమానుల పెళ్ళి వేడుకలు ఎలా ఉంటాయో గతంలో చూసే ఉంటాము..ఇప్పుడు మరోసారి పవన్ అభిమాని ఆలోచన నెట్టింట వైరల్ అవుతోంది..

జనసేన పార్టీ విరాళం కోసం అభిమానికి వచ్చిన ఆలోచనకు అంతా ఫిదా అవుతున్నారు. ఆ జిల్లాలో జనసేన అభిమానులు సైతం అవాక్కయేలా చేశాడు అతడు. సాధారణంగా ఎవరైన తమ ఇంట వేడుకలు చేసుకుంటే అందకు అందర్నీ ఆహ్వనిస్తారు. ఒకొక్కరు ఒక్కో విధంగా తమదైన బాణిలో బంధువులకు స్నేహితులకు కబురు చెబుతుంటారు. వచ్చిన ఆత్మీయులు కూడా తోచిన బహుమతి చదివిస్తుంటారు. అది నగదు, లేదా వస్తువు రుపేణా ఇవ్వడం ఆనవాయితీ..

విషయానికొస్తే..కోనసీమ జిల్లా లో ప్రచారమవుతున్న ఓ ఆహ్వాన పత్రిక ఏకంగా రాజకీయ దుమారాన్నే రేపుతోంది. మా ఇంట వేడుక ఉంది మీరంతా రావాలి. కాని వచ్చిన వారు బహుమతులు మాకివ్వొద్దు. జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వండంటూ చెప్పడం చర్చలకు దారీ తీసింది.నూకల వెంకట సుబ్బరావు లక్ష్మీ శైలజలు దంపతులు. వారి కుమార్తె సిరి రజస్వల వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానపత్రికను వేయించారు. అందులో వేదిక, విందు, వారి కుటుంబ సభ్యులు, తేది అన్ని వివరాలను పొందుపరిచారు..

మీరు మా విందు స్వీకరించండి, మా కుమార్తెను దీవించండి. అయితే కానుకలు మాత్రం మాకొద్దు. జనసేన పార్టీకి ఇవ్వండి. అందుకు మీరు జనసేన పార్టీ అధికారికంగా ఇచ్చిన ఫోన్‌పే / గూగుల్ పే నెంబరుకు నగదు పంపండని అందులో ఉండటం విశేషం..జనసేన కోసం విరాళాల సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఇచ్చిన 7288040505 నెంబరుకు నగదు పంపాలని జనసేన కార్యకర్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు.

ఈ నెంబరుకు ఏపీలో జనసేన కార్యకర్తలు తమ వంతుగా సహకారం అందిస్తున్నారు.. నగదు తో పాటు, బహుమతులు కూడా విరాళంగా ఇవ్వండంటూ చెప్పడంతో జనసేన కార్యకర్తలకు ఎక్కడలేని సంతొషాన్ని కలిగిస్తుంది..మొత్తానికి ఈ ప్రచారం వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news