Viral Video: ‘కాలా చష్మా’ పాటకు స్టెప్పులేసిన హాంకాంగ్ క్రికెటర్లు

-

బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, నటి కత్రీనా కైఫ్ జంటగా నటించిన సినిమా ‘బార్ బార్ దేకో’. ఈ సినిమాలోని ‘కాలా చష్మా’ పాట చాలా ఫేమస్ అయింది. ఈ సాంగ్‌పై చాలా మంది సెలబ్రిటీలు రీల్స్ చేశారు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను గెలిచిన తర్వాత శిఖర్ ధావన్, గిల్, ఇషాన్ కిషన్ తదితర టీమ్ ఇండియా ఆటగాళ్లు కాలా చష్మా సాంగ్‌పై డ్యాన్స్ చేశారు. ఉగాండాకు చెందిన పిల్లలు కూడా ఈ పాటపై అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

హాంకాంగ్ క్రికెట్ జట్టు
హాంకాంగ్ క్రికెట్ జట్టు

అయితే తాజాగా ఈ జాబితాలో హాంకాంగ్ క్రికెటర్లు చేరారు. ఆసియాకప్ టోర్నీకి అర్హత సాధించామన్న ఆనందంలో కాలా చష్మా సాంగ్‌కు క్రికెటర్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వికెట్ కీపర్ జీషన్ అలీ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. కాగా, టీమ్ ఇండియా, పాకిస్తాన్ ఉన్న గ్రూప్-ఏలో హాంకాంగ్ కూడా ఉంది. ఈ నెల 31న భారత్‌తో హాంకాంగ్ జట్టు తలబడనుంది.

https://www.instagram.com/reel/Chufg9WgVJC/?utm_source=ig_embed&ig_rid=5b43c3a5-7a04-4fb7-9641-9b0e6a97f54e

Read more RELATED
Recommended to you

Latest news