Asia Cup 2022 : హాంగ్ కాంగ్ పై సూర్యకుమార్ విధ్వంసం.. కోహ్లీ ఫిదా..తల వంచి మరీ

-

ఆసియా కప్ లో ఇండియా దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా… బుధవారం హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లోను టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్… సూర్యకుమార్ మాస్ ఇన్నింగ్స్ తో చెలరేగడంతో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు.

క్రిజ్ లోకి సూర్య రాకముందు ఎడ్లబండిలా సాగిన టీమిండియా ఇన్నింగ్స్, సూర్య బాదుడికి రాకెట్ స్పీడుతో దూసుకెళ్లింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ ఆఫ్ సెంచరీ తో టచ్ లోకి వచ్చిన, సూర్య సునామి ఇన్నింగ్స్ ముందు అది కూడా చిన్న పోయింది. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్స్ లు బాది 68 పరుగులు చేశాడు సూర్య. ఈ శివతాండవాన్ని నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండి కల్లారా చూసిన కోహ్లీ, సూర్యను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. బౌ డౌన్ తో సూర్య కుమార్ యాదవ్ ను గౌరవించాడు.

ప్రపంచ క్రికెట్లో కింగ్ లాంటి కోహ్లీ నుంచి ఇలాంటి ఊహించని రెస్పెక్ట్ పొందడంతో సూర్య సైతం ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ, సూర్యకు బౌ డౌన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ లాంటి లెజెండ్ సూర్య ఇన్నింగ్స్ కు ఫిదా అవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లోను హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ కు దినేష్ కార్తీక్ బౌ డౌన్ చేశాడు. ఇప్పుడు సూర్యాకు కోహ్లీ బౌ డౌన్ తో గౌరవించడంతో టీమిండియాలో మంచి స్నేహ వాతావరణం ఉందని, ఆటగాళ్లు ఒకరి సక్సెస్ ను మరొకరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుందని, ఇది జట్టుకు ఎంతో మంచి చేస్తుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news