గ్రాండ్ సక్సెస్: “విరూపాక్ష” డైరెక్టర్ ను ముద్దెట్టుకున్న మెగా హీరో !

-

మెగా కాంపౌండ్ నుండి సినీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సాయి తేజ్ కెరీర్ అలా దూసుకుపోతోంది. తాజాగా ఈ హీరో నటించిన విరూపాక్ష సినిమా ఈ రోజు థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. కాగా మొదటి షో నుండి ఈ సినిమాకు ఫ్యాన్స్ నుండి మరియు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ గా స్పందన వస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకు నచ్చినట్లే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఏ హీరో లేదా డైరెక్టర్ కు విడుదల అయ్యే మొదటి రోజు ఎంత టెన్షన్ గా ఉంటుందో తెలిసిందే. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొత్తం చిత్ర యూనిట్ అంతా కూడా ఫుల్ హ్యాపీ గా ఉంది.

ఈ సంతోషాన్ని డైరెక్టర్ కార్తిక్ మరియు తేజ్ హైద్రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంద్య థియేటర్ బయట మస్తు ఎంజాయ్ చేసుండ్రు. తేజ మరియు కార్తిక్ లు సినిమా హిట్ అయినందుకు ఒకరిని ఒకరు కౌగలించుకుని ముద్దులు పెట్టుకోవడం గమనార్హం. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news