ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ ” ఓరి దేవుడా” ట్రైలర్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న హీరో లు చాలా తక్కువగా ఉంటారు. ఫలక్ నుమా దాస్… సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోయాడు విశ్వక్ సేన్. చేసింది మొదటి సినిమా అయినప్పటికీ… యాక్టింగ్ లో ఎక్కడ తగ్గకుండా కుమ్మేశాడు విశ్వక్.ఈ సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆ తరువాత పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి విజయం అందుకున్న విశ్వక్సేన్ మరొక సినిమాను అనౌన్స్ చేశాడు.

ప్రస్తుతం “ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిథిలా పల్కర్ నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుండి ఓ అప్డేట్ ని ప్రకటించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు.

చిన్నప్పటినుంచి స్నేహితులుగా ఉన్న హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు. పెళ్లయిన తర్వాత అపార్ధాల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని కోర్టుకి వెళతారు.అయితే వీరు వీడిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు వీళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాడు?” తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. “జీవితాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు.. కానీ దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం సాధ్యమవుతుంది” అనే వాయిస్ ఓవర్ ను బట్టి చూస్తే సినిమా ఆసక్తికరంగానే ఉండేటట్లు తెలుస్తోంది . ఇక ట్రైలర్ చివరలో “వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండ్ వైఫ్ లా వచ్చిందనుకో” అంటూ వెంకటేష్ కు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news