ఒక్కోసారి మనము చేయని తప్పులకు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఒక వీఆర్వో విషయంలో అదే జరిగింది. మాములుగా వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులతో మీటింగ్ లు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా తిరుపతి నగర సమస్యలపై కమిషనర్ హరిత సచివాలయ ఉద్యోగాలతో జూమ్ వీడియో కాల్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ మీటింగ్ కు సచివాలయ ఉద్యోగులు అందరూ అధికారికంగా యూనిఫార్మ్ లలో హాజరయ్యారు.
కానీ వారిలో VRO ప్రసాద్ మాత్రం యూనిఫామ్ లేకుండా హాజరవడంతో కమిషనర్ హరిత ఎందుకు ఇలా యూనిఫార్మ్ లేకుండా వచ్చారని అడుగగానే, VRO ప్రసాద్ చెప్పిన సమాధానం ఎలుక నా యూనిఫార్మ్ ను కొరికేయడంతో ఆగ్రహం చెందిన తిరుపతి కమిషనర్ హరిత వెంటనే ఆయనకు సస్పెన్షన్ జారీ చేసింది.