నేల మీద కూర్చోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా..? చూస్తే షాక్ అవుతారు..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కంఫర్ట్ ని కోరుకుంటున్నారు. దానితో సోఫాలు మీద మంచాల మీద ఎక్కువ సేపు కూర్చుంటున్నారు. మన పూర్వీకులు కింద ఎక్కువ సేపు కూర్చునే వారు కానీ ఈ రోజుల్లో చాలా మంది నేల మీద కూర్చోవడం లేదు. భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద వర్క్ చేసేటప్పుడు కుర్చీల మీద టీవీ చూసేటప్పుడు సోఫాలు మీద ఇలా కింద కూర్చోవడమే పోయింది. నిజానికి నేల మీద కూర్చుంటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నేల మీద కూర్చోవడం వలన స్టెబిలిటీ పెరుగుతుంది స్టేబుల్ గా కూర్చోవచ్చు. అలానే నడుము టైట్ గా ఉంటుంది. స్టిఫ్ గా ఉంటుంది. నడుము ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది. లోవర్ బాడీ మజిల్స్ స్ట్రెచ్ కూడా అవుతాయి. అలానే కింద శరీర భాగాలకు వ్యాయామమైనట్లు అవుతుంది. కింద కూర్చునేటప్పుడు సరైన పోస్టర్ లో కూర్చోండి. కింద కూర్చోవడం వలన వెన్నెముక ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నడుము నొప్పి సమస్య నుండి బయట పడేస్తుంది.

అలానే కింద కూర్చోవడం వలన మజిల్ యాక్టివిటీ మరింత పెరుగుతుంది ఇలా కింద కూర్చోవడం వలన రకరకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. పలు రకాల సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే కింద కూర్చోవడం వలన కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీ యొక్క జాయింట్ల వద్ద ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ తగ్గుతుంది మళ్లీ లేచి నిలబడేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news