‘సామీ సామీ’ అంటోన్న వార్నర్ కూతుళ్లు..వీడియో వైరల్

-

ఎప్పుడు తెలుగు సినిమాల పాటలకు డాన్స్‌లు, డైలాగులు చెబుతూ… డేవిడ్‌ వార్నర్‌ అందరినీ ఆకట్టుకుంటారు. అయితే.. ప్రస్తుతం వార్నర్‌ దృష్టి పుష్ప పైనే పడింది. వరుసగా ఈ సినిమా పాటలకు స్టెప్పులేస్తున్నాడు వార్నర్‌ భాయ్‌. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే శ్రీ వల్లి, ఏయ్‌ బిడ్డా పాటలకు కాలు కదిపిన డేవిడ్‌ వార్నర్‌ సదరు వీడియోలను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్టు చేశారు.

దీంతో ఈ వీడియోలు కాస్త నెట్టింట వైరల్‌ గా మారాయి. ఇక తాజాగా డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌ స్టా గ్రామ్‌ వేదికగా పోస్టు చేసిన మరో వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుష్పలోని సామీ సామీ పాటకు వార్నర్‌ కూతుళ్లు వేసిన స్టెప్పుఉ వైరల్‌ గా మారాయి. అచ్చం రష్మిక ను పోలిన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇక చివరిలో పుష్ఫ రాజ్‌ తగ్గేదేలే మేనరిజం ను చేయడం కొస మెరుపు. దీంతో ఈ వీడియో నెటిజన్లు కొందరు పుష్ప సినిమా కు వార్నర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారేలా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Read more RELATED
Recommended to you

Latest news