ఇంకా తెలుగుదేశం పార్టీని భవిష్యత్‌లో నడిపించే నాయకుడు ఎవరో టీడీపీ శ్రేణులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు తర్వాత సైకిల్‌ని నడిపించేది చినబాబు అని తమ్ముళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఇంకా టీడీపీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అని తమ్ముళ్ళు ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. అదేంటి చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు చినబాబే చూసుకుంటారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది కదా…మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది అనుకోవచ్చు.
కానీ మొన్నటివరకు సరిగ్గా క్లారిటీ లేదనే చెప్పాలి. చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఇప్పుడే చంద్రబాబు తప్పుకుని ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ చంద్రబాబు మళ్ళీ పార్టీని గాడిలో పెట్టడం, పార్టీని పికప్ చేయడంతో కాస్త చంద్రబాబు నాయకత్వంపై అనుమానాలు పోయాయి. ఏదేమైనా మరో 10 ఏళ్ల వరకు పార్టీని చంద్రబాబు నడిపించేలా ఉన్నారు.
సరే చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు చినబాబుకే ఇస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ విషయాన్ని కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకించే పరిస్తితి కనిపించింది. ఎన్టీఆర్‌ని పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ వారు తీసుకొచ్చారు. అదే సమయంలో కొందరేమో చినబాబు వైపు మొగ్గు చూపారు.
కానీ తాజాగా నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడూలేని విధంగా సోషల్ మీడియాలో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు జరిపారు. కింది స్థాయి కార్యకర్త నుంచి పైనున్న టీడీపీ పెద్ద నేతలు వరకు చినబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. సరే పుట్టిన రోజు కాదు కదా.. శుభాకాంక్షలు చెప్పడం మామూలే అనుకోవచ్చు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది…చాలామంది టీడీపీని నడిపినే భావి నాయకుడు అంటూ పోస్టులు పెట్టేశారు. బుచ్చయ్య చౌదరీ లాంటి వారు కూడా అదే బాటలో వచ్చారు. అంటే ఇంకా నెక్స్ట్ టీడీపీని నడిపించేది చిబాబాబు అని తమ్ముళ్ళు ఫిక్స్ అయిపోయారు.