ఈ రోజు వరల్డ్ కప్ క్వాలిఫైయర్ లో జరిగిన జింబాబ్వే మరియు స్కాట్లాండ్ మ్యాచ్ లో హోం టీమ్ ఓడిపోయి వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. ఎన్నో ఆశలతో ఈ టోర్నీలోకి వచ్చిన జింబాబ్వే కు స్కాట్లాండ్ రూపంలో బలమైన షాక్ తగిలింది. ఈ టోర్నమెంట్ లో జింబాబ్వే అత్యధిక స్కోరు కు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 234 పరుగులు చేయగా, లీస్క్ 48 పరుగులతో రాణించారు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే మరో 31 పరుగల దూరంలో నిలిచిపోయి ఆల్ ఔట్ అయింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఓడిపోవడం ద్వారా వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అర్హత సాదించకుండానే ఔట్ అయిపోయింది. ఇది నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. జింబాబ్వే ఆటగాళ్లలో ర్యాన్ బర్ల్ 83 పరుగులు చేసి చివరి వరకు జట్టును విజయానికి దగ్గరగా ఉంచాడు.
ఇతనికి మదేవెరే 40 నుండి చక్కని సహకారం లభించినా కీలక సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు విజృంభించడంతో ఓటమి ఖరారు అయింది.