తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బల్దియా కమిషనర్‌గా రోనాల్డ్ రాస్

-

తెలంగాణ‌లో న‌లుగురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా రొనాల్డ్ రోస్‌ను నియ‌మించింది. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లోకేశ్ కుమార్ ను బదలీ చేసింది ప్రభుత్వం.

Ronald Ross appointed Commissioner of GHMC

ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్ కు అప్పగించింది. ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా ముషార‌ఫ్ అలీ ఫారుఖీ, రాష్ట్ర అద‌న‌పు ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా లోకేశ్ కుమార్, రాష్ట్ర సంయుక్త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news