30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రాహుల్‌ గాంధీ

-

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్‌ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించగా, బాన్స్‌వారాలో నిర్వహించిన సభ లో రాహుల్‌ మాట్లాడుతూ… ’25 ఏళ్ల లోపు వారికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ/ ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తాం అని తెలిపారు.

ఉద్యోగ నియామక ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు చట్టం తీసుకువస్తాం అని హామీ ఇచ్చారు.. స్టార్టప్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తాం. ఈ నిధితో లక్షలాది యువతకు ఉపాధి దొరుకుతుంది’ అని ఆయన తెలిపారు. దేశంలో రైతులు పండించిన పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పిస్తామని ఆయన అన్నారు.గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version