ఏడాదికి యాభై ఐదు వేల కోట్లు చెల్లిస్తాను. వచ్చే రెండేళ్లు అప్పు చేస్తే లక్ష కోట్లు పైగా అప్పు. మరి! వడ్డీ మాట ! ఆ మాట ఎవ్వరూ అడగడం లేదు. అప్పులు చేసిన ప్రతిసారీ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. అయినా కూడా విదేశీ రుణాల వైపు ఆశగా చూడక తప్పడం లేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఇంతవరకూ జగన్ విదేశాలకు వెళ్లిన దాఖలాలు పెద్దగా లేవు. వెళ్లినా కూడా రుణాలు తీసుకురాలేదు. టీడీపీ బాస్ చంద్రబాబు కన్నా ఈ విషయంలో జగన్ కు తక్కువ మార్కులే పడతాయి. అయితే తనఖా రుణాలు టీడీపీ సర్కారులో కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి.
ఇవి కాకుండా టీటీడీ ఆస్తులను తనఖా పెట్టాలన్న ఆలోచన వచ్చినా ఆ దేవదేవుడే అడ్డుకున్నాడు. ఏదేమయినప్పటికీ జగన్ కు ఓ చిన్న తప్పిదంను పెద్దదిగా చేసే అలవాటు మాత్రం బాగానే ఉంది. తక్కువ అప్పుతో మొదలయి రాష్ట్రాన్ని నిలువునా ముంచేసే స్థాయికి ఆయన చేరుకోవడం ఓ విధంగా దురదృష్టాన్ని కోరి తెచ్చుకోవడమే! ఇప్పుడు ఆయన దిగిపోయే నాటికి ఆంధ్రా అప్పు 12 లక్షల కోట్లకు పైగా..
సంక్షేమం తన ధ్యేయం అని అంటున్న జగన్ కు మరికొన్ని ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయి. ఇందుకు తగ్గ పురోగతిలో ఆయన లేరు. ఇందుకు తగ్గ పరుగు ఆయన దగ్గర లేదు. ఖజానా ఇప్పటికే ఖాళీ. కొన్ని పనులు బాగున్నా కూడా కొనసాగించలేకపోతున్నారు. ముఖ్యంగా ద్రవ్య వినిమయం, నియంత్రణకు సంబంధించి అనుభవ శూన్యత ఉంది.
అప్పుల కోసమే ఆర్థిక రంగ నిపుణులను నెత్తిన పెట్టుకున్నా పని జరగడం లేదు. మరి! ఈ సందర్భంలో పన్నులు పెంచితే ఎలా ఉంటుంది..జనం అస్సలు ఒప్పుకునేలా లేరు. ఓ విధంగా తిరుగుబాటు చేసేలా ఉన్నారు.ఇంకా చెప్పాలంటే పన్నుల ఎగవేతదారులుగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది.