ముగ్గురు వెస్టిండీస్ క్రికెటర్లకు కరోనా.. పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు వెస్టిండీస్ భారీ షాక్..

చాలా ఏళ్ల తరువాత స్వదేశంలో వెస్టీండీస్ తో జరుగుతున్న సిరీస్ కు పాకిస్థాన్  సిద్ధమవుతోంది. అయితే కరోనా కారణంగా ఈ సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. రేపటి నుంచి పాకిస్థాన్ తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ లో ఆడనున్న వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. వెస్టిండీస్ ప్లేయర్లు రోస్టన్ ఛేజ్, షెల్డన్‌ కాట్రెల్‌, కైల్‌ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. అయితే సిరీస్ కొనసాగుతుందా.. లేదా.. అనే సందేహాల నడుమ వెస్టిండీస్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారమే టీ20 సిరీస్ కొనసాగుతందిని విండీస్ బోర్డ్ వెల్లడించింది.

శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి అనంతరం నుంచి దశాబ్ధంపైగా పాకిస్థాన్లో ఏ జట్టు కూడా క్రికెట్ ఆడేందుకు ముందుకు రాలేదు. తొలిసారిగా వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్తోంది. ఇటీవల శ్రీలంకతో సిరీస్ ముగించుకుని నేరుగా పాకిస్థాన్ వెళ్లింది వెస్టిండీస్ జట్లు. కరాచీ వేదికగా డిసెంబర్ 13న పాకిస్థాన్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లకు చేసిన కరోనా టెస్టులలో ముగ్గురికి కరోనా రావడంతో ఆ జట్టు ఆందోళన చెందుతోంది. మరోొవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కుడా ఆందోళనలో ఉంది. చాలా ఏళ్ల తరువాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన జట్టులో ఆటగాళ్లకు కరోనా సోకడం పాక్ ను కూడా ఆందోళన పరుస్తోంది.