చంద్రబాబు..వెన్నుపోట్లకే పితామహుడు : విజయసాయి

వైసిపి పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… నారా చంద్రబాబు నాయుడు పై సెటైర్లు పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో విషయమై… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై.. కామెంట్లు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు పేల్చారు.

“పార్టీ నేతలే కుప్పంలో తనకు వెన్ను పోటు పొడిచారంటూ వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు వాపోతున్నాడు. కోవర్టులను సహించనంటున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటున్నారు కార్యకర్తలు. ఎన్టీఆర్ కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్పానిదీ ఒక పోటా బాబూ? ” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.

ఇక మరో ట్వీట్.. ఉన్న నలుగురుని కాపాడుకోవడానికి రాజీనామాలకు సిద్ధమా అంటూ చంద్రబాబు మరో నాటకానికి తెరతీశాడంటూ మండిపడ్డారు. 2019 నుంచీ చంద్రబాబువి అన్నీ ఉడతఊపులేనని… తాను, తనవాళ్లతో రాజీనామాలు చేయించి బలమేంటో చూపించుకోవాలి గానీ, మీరు చేస్తే మేం చేస్తామనే మెలికలేంటి? రెఫరెండం కోరితే ఉన్నదీ ఊడుతుందని చురకలు అంటించారు విజయసాయి రెడ్డి.