ఉదయాన్నే కలబంద జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..!

-

కలబంద మొక్క ఇంట్లో ఉండటం వల్ల మంచి ఆక్సిజన్ లభిస్తుందంటారు. ఆక్సిజన్ మాత్రమే…బ్యూటీ టిప్స్ లోనూ, ఆరోగ్యంలోనూ కలబంద వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది హెయిర్ కి, ఫేస్ కి కలబంద పేస్ట్ ని అప్లై చేస్తుంటారు. అందంతో పాటు ఆరోగ్యం కూడా రావాలంటే కలబంద జ్యూస్ ని ప్రతిరోజూ తాగాల్సిందే..కలబంద జ్యూస్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడేవారికి..కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుంది. మెగ్రేన్ నొప్పులకు ఇది చక్కటి పరిష్కారం.

శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటివల్ల చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజూ పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఆరోగ్యంగా ఉండేదుకు ఇది చక్కగా పనిచేస్తుంది.

జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. కేలరీలను, ఫ్యాట్‌నూ తగ్గిస్తుంది. ఈ రోజుల్లో శరీరంలో కొవ్వు పేరుకుపోయి…బాడీ షేప్ ఔట్ అవుతుంది. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మ రసం కలపాలి. ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి వెళ్లేముందుగానీ, లేదా వర్కవుట్ పూర్తైన తర్వాత గానీ… ఈ జ్యూస్ తాగుతుండాలి. రోజూ ఇలా చేస్తే, మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు మీకు అనిపిస్తుంది. జిమ్‌లో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మీ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది.

 

చాలామందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటివారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనంకలుగుతుంది. కలబంద తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి.

శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గి…రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవ్వడంతో పాటు అలసట ఉంటుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజూ ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి, రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా తగ్గుతుంది.

అయితే ఈ జ్యూస్ ని తాగటం వల్ల మీకు ఏమైన దుష్ప్రభావాలు ఎదురైతే వెంటనే తాగటం ఆపేయండి. డాక్టర్లను సంప్రదించి ఆపై నిర్ణయించుకోండి. కొందరికి ఈ జ్యూస్ సైడ్ ఎఫెక్ట్సు కూడా కలిగించవచ్చు. అయితే అవి తాత్కాలికమే.

Read more RELATED
Recommended to you

Latest news