ప్రభాస్ చిత్రాలకు ఏమయ్యింది.. అన్ని వాయిదానేనా..?

-

టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా ఇప్పటివరకు ప్రాజెక్టుకే, ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. సలార్ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ కే జి ఎఫ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని మంచి పాపులారిటీ సంపాదించారు. మొన్నటి వరకు సలార్ సినిమా షూటింగ్ ఆగిపోయినా.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇప్పటివరకు సలార్ సినిమా ఫస్ట్ భాగం పూర్తి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పక్కా ప్లాన్ తోనే ఈ సినిమాను ముందుకు తీసుకెళుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ సినిమాల పైన పలు రూమర్లు బాగానే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా షూటింగ్ అయిపోయి కొన్ని రోజులు కావస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యం కావడం జరుగుతొంది. కానీ ఈ సినిమా 2023 జూన్ లోనే రిలీజ్ కాబోతోంది అని చిత్ర బృందం ప్రకటించింది.

దీంతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహ చెందుతున్నారు . ఇప్పుడు సలార్ సినిమా మీద కూడా ఇలాంటి రూమర్ వినిపిస్తూ ఉన్నాయి. 2023 సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్నట్లు ఈ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక సలార్ సినిమా కూడా 2024 లోని విడుదల కాబోతోంది అంటూ రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రూమర్స్ పైన ఎలాంటి నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఇక మరొక పక్క ప్రాజెక్టుకే సినిమా కూడా 2024 లోనే విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ రూమర్సేనా లేకపోతే.. ఏంటన్న విషయం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. అయితే మా హీరోకి ఇలా ఎందుకు జరుగుతున్నాయంటూ ప్రభాస్ అభిమానులు నిరుత్సాహపరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news