తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించే పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…ఇప్పటికే ముందస్తు ఎన్నికల గురించి టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్ళ పర్వం నడిచింది…ఇక ఏదేమైనా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగేలా ఉన్నాయి…కానీ ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు..అయినా సరే మూడు పార్టీలు అధికారంలోకి రావడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. ఎవరు స్ట్రాటజీలు వారు అమలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ గా రాజకీయం నడుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. పైకి ఏమో టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది…కానీ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా అధికారంలోకి రావడానికి కావల్సిన వ్యూహాలని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ చేరికల విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది…కొంతమందికి కాంగ్రెస్ కండువా కప్పేశారు. అయితే మరికొంతమందిని కాంగ్రెస్ లోకి తీసుకోచ్చేందుకు అగ్రనేతలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే వారు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది…ఐదు రోజులు క్రితం ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్..కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి…ఈ నలుగురు కలిసి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. గత ఆదివారం నలుగురు కలిసి…టీఆర్ఎస్ లోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో, అలాగే బీజేపీలోని ఓ బడా నేతతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్నికలకు ముందు వారిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆ బీజేపీ బడా నేత ఎవరో కాదు…ఈటల రాజేందర్ అని మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఈటల…గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ని ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ ని ఓడించేది కాంగ్రెస్ అభ్యర్ధి అని రేవంత్ రెడ్డి అంటున్నారు…అంటే పరోక్షంగా ఈటల కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్ నేతలు సీక్రెట్ గా తెల్లవారు సమయాల్లో ఏం చేస్తున్నారో ఎవరికి క్లారిటీ రావడం లేదు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్…టీఆర్ఎస్, బీజేపీల్లో ఉన్న బలమైన నేతలని లాగేందుకే చూస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యూహకర్త సునీల్…ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతల లిస్ట్ తయారు చేసి…మాణిక్యం, రేవంత్ రెడ్డిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది..ఇప్పుడు ఆ లిస్ట్ ప్రకారమే..బడా నేతలని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే డౌట్ అందరిలో ఉంది. మరి చూడాలి కాంగ్రెస్ సీక్రెట్ పాలిటిక్స్ ఎంతకాలం నడుపుతుందో.