బ్యాంక్ లోన్ తీసుకున్నారా..? కట్టలేదా..? అయితే ఏం అవుతుందో తెలుసుకోండి..!

-

చాలా మంది బ్యాంకుల నుండి లోన్స్ ని తీసుకుంటూ వుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలం లో హోమ్ లోన్స్ ని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సొంతింటి కాలనీ నెరవేర్చుకోవాలని అనుకుంటే హోమ్ లోన్ తీసుకోవడం మంచిది. ఇల్లు కట్టడం, కొనడం హోమ్ లోన్ తో ఈజీగా ఇంటి ని కట్టచ్చు. అయితే ఒక్కోసారి బ్యాంకుల నుండి తీసుకున్న లోన్స్ ని చెల్లించకపోతే పెద్ద సమస్యే.

వాయిదాలు వాటి మీద వడ్డీలు ఇలా ఎంతో ఎక్కువ పే చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక చెల్లించకపోతే ఏం అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మాములుగా ఇంట్లో కొన్ని సమస్యల వలన ఏర్పడి ఒక్కోసారి ఒకటి లేదా రెండు ఈఎంఐలు కట్టడం ఆలస్యమవుతుంది. అప్పుడు మీకు బ్యాంక్ నుండి ఒత్తిడి వస్తుంది.

కానీ వరుసగా మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లింపుల్లో ఇబ్బంది వస్తే సమస్యే. నోటీసులు జారీ చేస్తాయి. ఆ తర్వాత కూడా మీరు స్పందించకపోతే మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించి నోటీసులు ఇస్తారు. ఇలా కనుక జరిగితే సిబిల్‌ స్కోర్‌ దెబ్బతింటుంది. సర్ఫేసీ చట్టం ప్రకారం 60 రోజుల గడువుతో మొదట నోటీసు పంపుతుంది. ఒకవేళ కట్టకపోతే చట్ట ప్రకారం ఆ ఆస్తిని రుణమిచ్చిన సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. అందుకే రుణాలు సకాలంలో చెల్లించాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 60 రోజుల గడువులో బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news