మొబైల్ రేడియేషన్ అంటే ఏంటి.. అసలు ఇది మనపై ఎలా ఎఫెక్ట్ అవుతుంది..?

-

మొబైల్ వాడకం.. ఈరోజుల్లో విపరీతంగా పెరిగింది. పొద్దున లేవగానే బ్రెష్ కంటే ముందు మొబైల్ ను పట్టుకుంటాం.. ఫోన్ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అసలు ఫోన్ లేకుండా బాత్రూమ్ కి కూడా పోరు కొందరైతే.. అయితే మొబైల్ పక్కన పెట్టుకోని నిద్రపోకూడదు, ఫోన్ ఎక్కువగా వాడకూడదు రేడియేషన్ అని అంటుంటారు కదా.. అసలేంటి ఈ రేడియేషన్ మీకేమైనా తెలుసా..? ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. చెడు ప్రభావం చూపుతుంది, అందుకే సెల్ టవర్స్ ఇళ్ల ముధ్యలో ఉంచుకోకూడదు, పక్షులు చనిపోతాయి అనేది అందరికి తెలిసిన విషయం.. ఈరోజు మనం రేడియేషన్ అంటే ఏంటి, దీని వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో చూద్దాం..
ఫోన్ ప్యాంట్‌ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయనీ, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ.. రకరకాల అభిప్రాయాలు నేడు ప్రచారంలో ఉన్నాయి. వీటిమీద జరిగిన ప్రయోగాలు మాత్రం పరస్పర విరుద్ధ ఫలితాలనే ఇస్తున్నాయి..రేడియేషన్ వల్ల కళ్లకు హాని కలుగడమే కాకుండా చర్మం రంగు మారుతుంది. కంటి రెటీనాలను బలహీనపరుస్తుంది.

 ‘రేడియేష‌న్ ’ అంటే..

సెల్‌ఫోన్‌ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడాన్నే.. రేడియేష‌న్ అంటారు. కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ఆ స్థాయిలో లేదన్నది చాలామంది అభిప్రాయం. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే, ఫోన్‌ రేడియేషన్‌ ఉంటున్నదని వారి వాదన. ఈ వివాదం తేలనంత వరకూ, వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదు కదా..
స్పీకర్ ఫోన్‌లో మాట్లాడటం, ఫోన్‌ నిరంతరం జేబులో కాకుండా పక్కన ఉంచుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూరంగా పెట్టడం లాంటి జాగ్రత్తలు పాటించమని నిపుణులు అంటున్నారు. మొక్కలు, పక్షుల మీద సెల్‌ఫోన్‌ టవర్ల రేడియేషన్‌ ప్రభావం ఉందని కొందరు పరిశోధకుల నమ్మకం. అయస్కాంత శక్తిమీద ఆధారపడే పక్షులకు.. ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ వాటి గుడ్లను నాశనం చేస్తాయనీ నిపుణులు అంటున్నారు. ఈ విషయాల గురించి కూడా కచ్చితమైన సమాచారం లేదు. అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల విషయంలో కొంత జాగ్రత్త పాటించాలి. రేడియేషన్‌ కారణంగా చర్మంపై దురద కలిగిస్తుంది. చర్మం పొడిబారడం, ఎరుపు, ముదురు రంగులోకి మారుతుంది.
నిత్యం ఎలక్ట్రానిక్‌ పరికరాల వల్ల హాని కలుగుతుందనేది జగమెరిగిన సత్యం… రేడియేషన్‌ కారణంగా చర్మంపై టానింగ్‌ బెడ్‌లను సృష్టిస్తాయి. కణజాలాల లొపలి పొరకు హాని కలిగిస్తుంది. వృద్ధాప్యం త్వరగా రావడమే కాకుండా దుష్ప్రభావాలకు దారి తీస్తుందని పరిశోధకులు అంటున్నారు.
మన వయసులో, చర్మ సున్నితత్వం అనేది ఎంతో ముఖ్యం. చర్మాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే విధంగా, శాశ్వతంగా నష్టాన్ని కలిగిస్తుంది. రేడియేషన్ కారణంగా చర్మ సున్నితత్వం కోల్పోతుంది. రేడియేషన్‌ తో చర్మం ఎర్రబడటం, పొడిబారుతుండటం జరుగుతుంది. అయితే చర్మం గాలిలో ఉండే హానికరమైన కణాలకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
USకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) 2011 సర్వే ప్రకారం.. రేడియేషన్‌ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలుగా మారే అవకాశం ఉంది. రేడియేషన్ ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుంది. ఫోన్‌లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.. రాత్రి సమయంలో ఫోన్ లైట్ ఆఫ్ చేసి అస్సలు వాడకూడదు. మీరు అలారం పెట్టుకుని.. కొందరు బెడ్ మీద వేసుకుని పడుకుంటారకు.. అలా అస్సలు చేయకూడదు. రాత్రి నిద్రపోయే సమయంలో ఫోన్ మీకు కనీసం ఆరు అడుగులు దూరంలో ఉండేలా చూసుకోండి. ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్నా సరే దానిలోని యాంటెన్నా, బ్యాటరీ రేడియేషన్ విడుదల చేస్తుంది. కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం.
ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటించడంతో పాటు.. సిస్టమ్స్ దగ్గర వర్క్ చేసేవాళ్లు.. సైట్ లేకున్నా.. యాంటిరేడియేషన్ కళ్లజోడ్లు వాడటం ఉత్తమం. దీనివల్ల లైటింగ్ డైరెక్టుగా ఫేస్ మీద పడదు. కళ్లకు అంత ఒత్తిడి ఉండదు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news