బ్లాక్‌ ఫంగస్‌పై డయాబెటీస్‌ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

-

కోవిడ్‌తో పోరాతున్న ప్రస్తుత తరుణంలో బ్లాక్‌ విజృంభణ కూడా ఒకింత భయాందోళన కలిగిస్తోంది. దీన్నే మ్యూకర్‌మైకోసిస్‌ అని కూడా అంటారు. ఇది చాలా అరుదైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. దాదాపు పది లక్షల మందిలో ఒకరికి సోకుతుంది. ఇది డయాబెటిక్‌ రోగులకు ప్రాణాంతకంగా మారుతోంది. దీన్నిపై ప్రముఖ డాక్టర్‌ శ్వేతా బద్యాల్, సీనియర్‌ ఎండోక్రనాలజిస్ట్‌ ఈ వ్యాధి లక్షణాలను తెలిపారు.

సైనస్, బ్రెయిన్‌ లేదా కాలేయంపై ప్రభావం చూపుతుందట. ఈ ఫంగస్‌ బ్రెయిన్‌తో పాటు ఇతర శరీర భాగాలకు చర్మం, పన్ను, ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుందని డాక్టర్‌ తెలిపారు. అయితే, ఈ కింది లక్షణాలు ఎవరికైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె చెప్పారు.

  • సైనాసైటీస్‌..ముక్కు ద్వారాలు మూసుకుపోవడం.
  • దవడ భాగంలో నొప్పి, ఒకవైపు ముఖం నొప్పి, తిమ్మిర్లు, వాపు
  • ముక్కుపై నలుపు రావడం
  • కళ్లు నొప్పి అయి, బ్లర్‌గా కనిపించడం
  • ఛాతినొప్పి, జీర్ణాశయం పై కూడా దీన్ని ప్రభావం ఉంటుంది.

ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ పెరుగుతున్న నేపథ్యంలో డయాబెటీస్‌ రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వైద్యులు తెలుపుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్‌ చెక్‌ చేసుకోవడం మంచిది. ఈ ఇన్ఫెక్షన్‌ డయాబెటీస్‌ రోగులపై అధిక ప్రభావం చూపుతుంది. కొవిడ్‌ భారిన పడిన వారిలో కొన్ని స్టెరాయిడ్స్‌ తీసుకోవడం వల్ల లంగ్స్‌లో మంటగా ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఏర్ప డతాయి. ఇమ్యూనిటీ సిస్టం దెబ్బ తింటుంది. షుగర్‌ లెవల్‌ కూడా పెరుగుతుంది. ఇది షుగర్‌ లేని వారిలో కూడా కనిపిస్తోంది.

డయాబెటీస్‌ ఉన్న వారు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ను ముందుగానే గుర్తించడం మంచిది. ఎందుకంటే దీనికి పవర్‌ఫుల్‌ చికిత్స అవసరమవుతుంది. లేకపోతే ఇతర అవయవాలపై కేన్సర్, కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. రోగాన్ని ముందే గుర్తించి నయం చేసుకోవడమే మేలని డాక్టర్‌ శ్వేత అంటున్నారు. దీనికోసం కొవిడ్‌ తగ్గిన తర్వాత సరైన స్టెరాయిడ్స్‌ తగిన సమయంలో తీసుకుని ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసుకున్నవారు గ్లూకోజ్‌ పరిమాణం ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news