జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాయకులు ప్రభావం చేయడం వల్లే పోలీసులు సరిగా విధులు నిర్వహించడం లేదన్నాడు. సజ్జనార్ లాంటి సీనియర్ ఆఫీసర్ టిఎస్ఆర్టిసి కి పరిమితం అయ్యారు అని చెప్పుకొచ్చాడు. ఎం.ఐ.ఎం నేతలకు టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని పేర్కొన్నాడు. ఒక సామాన్యుడిగా నాకు మాత్రం రఘునందన్ రావు చెప్పిందే నిజం అనిపిస్తుంది అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
కాగా నిర్భయ కేసులో మైనర్ నిందితుల పేర్లు బయటకు వచ్చాయన్న రఘునందన్ రావు.. కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం లేదని పోలీసులు ఎలా క్లీన్ చీట్ ఇస్తారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాతే పోలీసులు హడావిడి చేశారని విమర్శించారు. కేటీఆర్ సొంతపార్టీ వారి కోసం కాకుండా పక్క పార్టీ వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ వాళ్ళని అరెస్టు చేయకుండా ప్రయత్నం చేస్తున్నారన్న రఘునందన్ వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ఈ విధంగా స్పందించారు.
As far as the Jubilee Hills gang rape case is concerned, it seems to me as a common man that only @RaghunandanraoM seems to be truthful to the point and all others are using diversion tactics ..SAD
— Ram Gopal Varma (@RGVzoomin) June 7, 2022