భాగ్యలక్ష్మి అమ్మవారిని ఏమని మొక్కుతావు – యోగిపై జగ్గారెడ్డి ఫైర్

-

గుళ్ళు, దేవుళ్ళ పేరుతో బిజెపి రాజకీయం చేస్తుందంటూ మండిపడ్డారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఎనిమిది ఏళ్లలో తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏం చేసిందని మండిపడ్డారు.” కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? గిరిజన యూనివర్సిటీ ఎక్కడ? ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?” అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ కు వస్తున్న మోడీ వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విభజన చట్టంలోని అంశాలపై మోడీతో.. బండి సంజయ్, కిషన్ రెడ్డి లు సమాధానం చెప్పించాలని అన్నారు. అభివృద్ధి అనేది పక్కనపెట్టి బిజెపి రెచ్చగొట్టే రాజకీయాలకు దిగుతుందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్లి అమ్మ వారిని ఏమని మొక్కుతారు అని ప్రశ్నించారు. యోగి ప్రజల మనిషి అయితే.. ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని మొక్కలని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మొక్కాలన్నారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news