వాట్సాప్ వలన మనకు ఎన్నో లాభాలు వున్నాయి. కేవలం సందేశాల్ని పంపించడం కోసం మాత్రమే కాక ఎన్నో లాభాలను పొందొచ్చు. వాయిస్, వీడియో కాల్స్ కోసం కూడా మనం వాట్సాప్ ని ఉపయోగించుకోవచ్చు. కేవలం ఇదే కాక ఛాట్‌బోట్ సర్వీసు ని కూడా పొందొచ్చు. అలానే ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంతే కాక డ్రైవింగ్ లైసెన్స్, కారు లేదా బైకు ఇన్సూరెన్స్ కాపీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని కూడా మనం వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఇక ఎలా ఆ డాక్యుమెంట్స్ ని డౌన్లోడ్ చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాలని ఇప్పుడే చూద్దాం.
దీని కోసం మొదట కస్టమర్లు వారి యొక్క డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో సేవ్ చేసుకోవాలి.
డిజిలాకర్ అకౌంట్‌లో అవసరమైన సమాచారం ఇవ్వాలి.
ఇప్పుడు మీ ఆధార్ కార్డు తో వాట్సాప్ నెంబర్‌ను వెరిఫై చెయ్యండి.
ఇప్పుడు ఫోన్‌కు వచ్చే 6 అంకెల సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసేయండి.
డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు 9013151515 నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ ని పంపాలి.
వాట్సాప్‌పై మైగవ్ ఛాట్ విండో యాక్సస్ కోసం 9013151515 నెంబర్‌ను మీరు సేవ్ చేసుకోవాలి.
హాయ్ అన్నాక వెల్‌కమ్ మెసేజ్ వస్తుంది.
డిజిలాకర్ అకౌంట్ సమాచారాన్ని ఫిల్ చేయండి.
ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయాలి.
వాట్సాప్‌పై మెయిన్ మెనూ ఆప్షన్ వస్తుంది.
డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ కాపీ ఇవన్నీ కూడా మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.