నెటిజన్ అలా అడగడంతో.. షాకింగ్ రిప్లై ఇచ్చిన దృశ్యం పాప..!!

-

 సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారు ప్రస్తుతం హీరోయిన్లుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో నటి ఎస్తర్ అనిల్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించడంతో ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానాన్ని తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

దృశ్యం సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అందుచేతనే దృశ్యం -2 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో వెంకటేష్ సరసన మీనా కూడా నటించింది. ఇక మీనా చిన్న కూతురుగా ఎస్తర్ అనిల్ నటించడం జరిగింది. ఇక ఎస్తర్ చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఈమె ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం సోషల్ మీడియాని బాగానే వాడుకుంటోంది. ఇక అంతే కాకుండా మొదటిసారిగా హీరోయిన్ గా జోహార్ అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనది

ఇక తను నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఫోటోలను కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా బిజీ గానే ఉంటుంది. కాస్త సమయం దొరికినప్పుడల్లా నటీనటులు సైతం ఎక్కువగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఎస్తేరు కూడా చిట్ చాట్ చేయడం జరిగింది. అలా ముచ్చటిస్తున్న సమయంలో ఒక నెటిజన్ అనుకోకుండా నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పండి అని ప్రశ్న వేయగా అందుకు సంబంధించి ఒక షాకింగ్ రిప్లై ఇచ్చింది.. అదేమిటంటే తనతో పాటు ఉన్న ఒక కుక్క పిల్ల ఫోటోని షేర్ చేసి తనే నా బాయ్ ఫ్రెండ్ అని ఆ నెటిజన్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలు వేసుకున్నారు.

Ester, Venkatesh, Meena

Read more RELATED
Recommended to you

Latest news