ఈరోజు నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు?: కేటీఆర్ ట్వీట్

-

ఇటీవల మునుగోడులో బిజెపి బహిరంగ సభ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమయంలో బండి సంజయ్ చేసిన ఒక షాకింగ్ పని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహంకాళి అమ్మవారిని దర్శించుకుని కేంద్ర మంత్రి అమిత్ షా బయటకు రాగానే.. బండి సంజయ్, అమిత్ షా చెప్పులను చేతులతో తెచ్చి కాళ్ళ ముందు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నేడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనుంది.

ఈ సభకి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ” నేడు జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్న వేశారు. దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా చెబుతున్నానని వ్యంగ్యంగా ట్విట్ చేశారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version