కలియుగ దైవం శ్రీ తిరుమల శ్రీవారికి ఎన్నో రకాల ఉత్సవాలను నిర్వహిస్తారు..స్వామివారిని తిలకించడానికి భక్తులు ఎక్కడేక్కడి నుంచో వస్తున్నారు.అయితే ఇప్పుడు స్వామివారి సేవల పై టిటిడి మరో నిర్ణయాన్ని తీసుకుంది.స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేదుకు దళిత గోవిందం కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. అనంతరం దళితవాడల్లో శ్రీవారి ఆలయాలను నిర్మాణం చేపట్టింది. హిందూ సంప్రదాయాలను, సంకృతులను వాడవాడలా వ్యాప్తి చేసేలా పలు కార్యక్రమాలను చేపట్టిన టీటీడీ.. వైభవోత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు సంకల్పించింది. అసలు శ్రీవారి వైభవోత్సవాలు అంటే ఏమిటి..? ఆ ఉత్సవాలలో ఏ ఏ సేవలు చేస్తారు,ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
స్వామి వారిని సామాన్య భక్తులు సాధారణ సర్వ దర్శనం, దివ్య దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవ సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది టీటీడీ. ఇక నిత్య సేవల్లోను లక్కీ డిప్ ద్వారా సామాన్య భక్తులకు సేవ భాగ్యం ఇస్తున్నా.., అందరి భక్తులకు ఆ భాగ్యం దక్కదు. స్వామి వారి సేవలను చూసి తరించే భాగ్యం కొందరికే సాధ్యం అవుతుంది. భక్తులందరూ స్వామి వారి సేవను తిలకించే విధంగా వాడవాడలా తెలిపే విధంగా, స్వామి వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా 2014లో వైభవోత్సవాలు ప్రారంభించింది..అయితే కరోనా సమయంలో ఈ ఉత్సవాలు నిలిచి తప్పకుండా
నిర్వహిస్తార్శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య వారోత్సవాలే వైభవోత్సవం..శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాతసేవ మొదలుకొని, తోమాల సేవా, అర్చన సేవలను నిర్వహిస్తారు. ఇక సాయంకాల ఆరాధనగా తోమాల సేవా, అర్చన సేవలని నిర్వహిస్తారు. ఇవన్నీ ధ్రువబేరంగా మూలవిరాట్ కు నిత్య కైంకర్యాలుగా నిర్వహిస్తారు. ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం (ఉంజల్ సేవా), అర్జిత బ్రహ్మోత్సవం, అర్జిత వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు ఉత్సవ బేరమైన శ్రీదేవి భూదేవి సామెత శ్రీ మలయప్ప స్వామి వారికీ నిర్వహించడం ఆనవాయితీ..అనాది కాలం నుంచి అధికారులు ఈ సేవలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
అన్ని సేవల తర్వాత స్వామికి ఏకాంత సేవను నిర్వహిస్తారు.ఒక్కో వారం ఒక్కో సేవ నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం అష్టాదల పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం సడలింపు, నేత్ర దర్శనం ,తిరుప్పావడ, పూలంగిసేవ చేస్తారు. శుక్రవారం ఎంతో విశేషంగా అభిషేఖం., నిజపాద దర్శనం నిర్వహిస్తారు. ఈ సేవలన్నీ స్వామి వైభవోత్సవల్లో నిర్వహించనుంది.ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో వైభవోత్సవాలు నిర్వహించనున్నాం. సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. మంగళవారం అష్టాదల పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం సడలింపు,నేత్ర దర్శనం, తిరుప్పావడ,పూలంగిసేవ చేస్తారు. శుక్రవారం ఎంతో విశేషంగా అభిషేఖం., నిజపాద దర్శనంను నమూనా ఆలయంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు అంటున్నారు..