మూత్రవిసర్జన సమయంలో మంట ఎందుకు వస్తుంది..? ఈ సమస్య నుండి ఎలా బయట పడాలంటే…!

-

ఒక్కొక్కసారి మూత్రవిసర్జన సమయంలో మంట కలుగుతూ ఉంటుంది. యూరిన్ ఎక్కువ సేపు వెళ్లకుండా ఉండిపోయి చాలా సేపు తర్వాత మూత్ర విసర్జన చేస్తే మంట కలుగుతుంది. అలానే ఎన్నో సమస్యలు దీని వల్ల కలుగుతాయి. అందుకనే ఎక్కువ సేపు యూరిన్ వెళ్లకుండా కూర్చుని ఒకేసారి వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 

దీని వల్ల ఇరిటేషన్ కూడా కలుగుతుంది. మహిళల అయినా పురుషులైనా సరే ఎక్కువ సేపు మూత్ర విసర్జన చేయకుండా ఉంటే యూరినరీ గ్లాండ్ మరియు యురెత్రా లో బర్నింగ్ సెన్సేషన్ కలుగుతుంది. అయితే అసలు ఎందుకు యూరిన్ వెళ్లేటప్పుడు మంట కలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఎందుకు వస్తుంది..?

సరిపడా నీళ్లు తీసుకోకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. నీళ్లు ఎక్కువగా లేకపోవడం వల్ల మూత్రవిసర్జన చేసినప్పుడు మండుతుంది. అందుకని కచ్చితంగా ఆరు లీటర్ల నీళ్ళు తీసుకోవడం మంచిది.
ఎక్కువ కారం, స్పైసీ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల కూడా యూరిన్ కి వెళ్ళినప్పుడు మంట కలుగుతుంది. కనుక మూత్రవిసర్జన సమయంలో మంట కలుగుతుంటే ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
కొంతమందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి దీనివల్ల కూడా మూత్ర విసర్జన చేసినప్పుడు మంట కలుగుతుంది.

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట కలగకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కాలని పాటించండి:

శరీరానికి సరిపడా నీళ్ళు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
అలానే పండ్లరసాలు తీసుకోవడం కూడా మంచిదే.
నిమ్మరసం, పుదీనా వంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది.
ఎక్కువ కూరగాయలు తీసుకోవడం కూడా మంచిదే.
కొబ్బరి నీళ్లు తాగితే కూడా మంట తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version