ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో ఇప్పుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం ఆశ్చర్యం గా మారింది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు డీజీపీని అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి రాష్ట్రంలో పరిపాలన శాంతిభద్రతలు సహా ఇతర కీలక నిర్ణయాలపై జరిపిన చర్చలు ఆశ్చర్యకరంగా మారాయి. ఇన్నాళ్లు అన్నీ చూస్తూ వచ్చిన గవర్నర్ ఇప్పుడు అనూహ్యంగా వాళ్ళని ఎందుకు పిలిచారు అసలు ఇంత అర్జెంట్ గా పిలవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనేదానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది.
రాజధాని మార్పు విషయంలో కొన్ని జీవోలు ప్రధాన కార్యదర్శి సంతకం లేకుండానే వెళ్లాయి. దీంతో అసలు అవి ఏ విధంగా వెళ్లాలి అనే దాని మీద కూడా గవర్నర్ ఆరా తీసినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొన్నిచోట్ల చోటుచేసుకున్న పరిణామాలపై కూడా గవర్నర్ డీజీపీని వివరణ అడిగినట్లు సమాచారం. శ్రీకాళహస్తి మాచర్ల అలాగే పుంగునూరు ప్రాంతాల్లో కొన్ని చోట్లా ఏకగ్రీవం అయిన సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో హత్యాయత్నాలు జరిగాయి. అవికూడా విపక్ష తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలను కూడా గవర్నర్ కు టీడీపీ నేతలు చూపించారు. వాటిని కూడా చూపించి గవర్నర్ వివరణ అడిగినట్లు సమాచారం. అసలు పరిపాలన ఏ విధంగా ఉంది అనే విషయాలను గవర్నర్ ఎక్కువగా అడిగినట్లు సమాచారం. అయితే దీని వెనుక కేంద్రం ఉంది కాబట్టే ఈ విధంగా గవర్నర్ జోక్యం చేసుకున్నారని అసలు గవర్నర్ ఇలా అడగటం వెనుక కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉందని వాళ్ళ సూచన మేరకే గవర్నర్ ఈ విధంగా ఆరా తీశారని అంటున్నారు.