ఈ మధ్యకాలంలో చాలా మంది వాచీలు ని పెట్టుకోవడం మానేశారు. ఫోన్ వచ్చినప్పటినుండి కూడా వాచీలను దూరం పెట్టేశారు. కానీ చాలా మంది ఇంకా టైం చూసుకోవడానికి వాచీని పెట్టుకుంటున్నారు. మామూలు వాచీలు కాకుండా డిజిటల్ వాచీలని స్మార్ట్ బాండ్లను ఎక్కువ మంది వాడుతున్నారు. అయితే ఏ రకం వాచి పెట్టుకున్నా సరే ఎడమ చేతికి వాచీ ని ధరిస్తారు అయితే కుడి చేతికి వాచీని ఎందుకు పెట్టుకోకూడదు.. ఎడమ చేతికి ఎందుకు పెట్టుకోవాలి అనే విషయాన్ని చూస్తే..
ఎక్కువ మంది కుడి చేతులతోనే పని చేసుకుంటారు అంటే కుడి చేతి వాటం కలవారు ఎక్కువమంది ఉంటారు. కుడి చేత్తో రాయడం టైపింగ్ చేయడం లేదంటే ఏదైనా పని చేసినా కూడా ఎడమ చేతికి వాచి ఉండడంతో ఈజీగా మనం ఎంత పనిలో ఉన్నా కూడా టైం ఎంత అయ్యింది అనేది చూసుకోవచ్చు టైం చూడడానికి ఎలాంటి ఇబ్బంది రాదు. అందుకే ఎడమ చేతికి వాచీని పెట్టుకుంటారు. కుడి చేతికి వాచీని పెట్టుకోరు.
ఒకవేళ కుడి చేతికి పెట్టుకుంటే పనిలో ఉన్నప్పుడు టైం చూసుకోవడానికి అస్సలు కుదరదు. ఎడమ చేతికి పెట్టుకోవడం వలన ఈజీగా మనం కొన్ని సెకండ్లలోనే టైం ని చూసుకొని తెలుసుకోవచ్చు. టైం చూడడానికి సౌకర్యంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది కూడా రాదు ఇదే సౌకర్యంతంగా అనిపించి అప్పటి వాళ్ళు ఎడమ చేతికి వాచీ పెట్టుకోవడం మొదలుపెట్టారు దానిని ఇప్పటి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నాము. వాచి మోడల్స్ మారినా స్మార్ట్ వాచ్లు బ్యాండ్లు వంటివి వచ్చినా కూడా ఎడమ చేతికి పెట్టుకోవడం జరుగుతోంది