లాటరీ తగలడం అంటే..లైఫ్ యూటర్న్ తీసుకోవడమే.. కష్టాలన్నీ పోయి.. వచ్చిన డబ్బుతో హ్యాపీగా బతకొచ్చు అనుకుంటారు ఎవరైనా.. కానీ పాపం ఆ వ్యక్తికి లాటరీ తగలడం ఆనందాన్ని కాదు.. విషాదాన్ని మిగిల్చింది. థాయ్‌లాండ్‌కు చెందిన మణిత్ అనే వ్యక్తి రూ. 1.3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతను తెగ ఆనందపడటమే కాకుండా అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దాం అనుకున్నాడు. మిగిలిన సోమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్ వేసుకున్నాడు.. అయితే పాపం ఇది అతనికి విషాదాన్ని మిగుల్చుతుందని కలలో కూడా ఊహించలేదే.. అతడి భార్య అంగ్‌కన్‌రత్ ఆ లాటరీ సొమ్ము తీసుకుని తన ప్రియుడుతో జంప్.
ఇదంతా తెలియని మణిత్ లాటరీ గెలుచుకున్నాను కదా అని కుటుంబసభ్యులతో గ్రాండ్‌గా పార్టీ చేసుకుంటున్నాడు. ఆ వేడుకలో భార్యతో కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఎవరని ప్రశ్నిస్తే తమ బంధవు అని చెప్పింది. దీంతో అతను తన భార్య తరుఫు బంధువుగానే భావించాడే తప్ప పాపం ఏం సందేహ పడలేదు.. ఆనందంగా పార్టీలో మునిగిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఐతే మణిత్, అంగన్‌రాత్‌లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. ఆమె పారిపోతుందనేలా తనపై ఎలాంటి సందేహం తనకు రాలేదని మణిత్ పోలీసులకు వివరించడు.. పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో మణిత్‌కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు. అతను ఆ లాటరీ డబ్బును ఆమెకే ఇచ్చి దాయమని చెప్పినట్లు పోలీసులకు చెప్పాడు. తాము కేవలం అతడి భార్యను ఒప్పించి డబ్బు ఇప్పించే ప్రయత్నం మాత్రమే చేయగలమని, పైగా ఆ సోమ్ము చట్టబద్ధంగా వారికి చెందదు అని మణిత్‌కి చెప్పారు. దీంతో అతను భార్య కోసం తీవ్రంగా గాలించడమే కాకుండా చివరకు థాయ్‌లాండ్ మీడియాను కూడా సంప్రదించాడు.. పాపం అతనికి లాటరి వచ్చిన ఆనందం కంటే.. భార్య వెళ్లిపోయిందన్న బాధ ఎక్కువగా ఉంది.