తెలుగు చిత్ర పరిశ్రమలో పూర్ణ స్టార్ హీరోయిన్ అవుదామని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె సమయం బాలేక ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే సెటిల్ అయిందని చెప్పవచ్చు . ముఖ్యంగా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేకపోయినా .. మలయాళం బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. ఇక ప్రేక్షకులలో తన పేరును పదిలం చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పూర్ణ ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో అవును, అవును 2 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించినా.. చెప్పుకోదగ్గ విజయాన్ని అయితే సాధించలేదు.
తర్వాత ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో అవకాశాలు వస్తున్న సమయంలో వాటికి పుల్ స్టాప్ పెట్టి బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఢీ వంటి డాన్స్ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరించింది. ముఖ్యంగా ఈ షోలో పూర్ణ చేసిన సందడి అంతా ఇంతా కాదు. చూసే ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా కొంచెం ఎమోషనల్ డాన్స్ వస్తే ఏడ్చేయడం , డాన్స్ నచ్చితే కొరికేయడం.. దీంతో జనాల్లోకి బాగా ఎక్కింది పూర్ణ. క్రమంలోనే ఈ షోలో ఈమె హై లెవెల్ పర్ఫామెన్స్ చూసి ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్స్ లో డైరెక్టర్ అవకాశం ఇచ్చారు. అలా అఖండ సినిమాతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రను సొంతం చేసుకొని విజయాన్ని అందుకున్న ఈమెకు వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు వస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వివాహమనే చెప్పాలి. అఫీషియల్ గా తన భర్తను అందరికీ చూపించింది. జేబీఎస్ గ్రూపు కంపెనీ ఫౌండర్ షానిధ్ అసిఫ్ అలీతో కలసి నటి పూర్ణ ఏడడుగులు వేయబోతోందట. ఇక వీరికి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్లో ఈ జంట మూడుముళ్లతో ఒక్కటి కానున్నారు. అందుకే టోటల్గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందని సమాచారం.