ఉన్నట్టుండి వక్షోజాల సైజ్‌ పెరిగిపోతుందా..? కారణాలు, పరిష్కార మార్గాలు ఇవే..!!

-

అమ్మాయి అందాన్ని కళ్లు డిసైడ్‌ చేస్తాయి అంటారు. కళ్లు ఒక్కటే కాదు.. వక్షోజాలు కూడా ఆడవారి అందానికి కొలమానంగా చెప్పుకోవచ్చు. బాడీ హైట్‌, వెయిట్‌కు తగ్గట్టుగా రొమ్ము సైజు ఉంటే.. అది వారిని ఇంకాస్త అందంగా చూపిస్తుంది. మరీ తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా.. ఇబ్బందే.. అయితే ఏజ్‌ పెరిగే కొద్ది. వక్షోజాల సైజ్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జీవనశైలి వల్ల ఇలా జరుగుతుంది.

వక్షోజాల సైజ్‌ పెరగడానికి కారణాలు..

పెద్దని, బరువైన వక్షోజాలు కలిగి ఉన్న వారికి వాటి బరువు కారణంగా వెన్ను లేదా మెడ భాగంలో నొప్పులు వస్తాయి.. అయితే ఈ రొమ్ములు బరువుగా మారడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో రొమ్ము పరిమాణం బాగా పెరుగుతుంది. అదే సమయంలో, హార్మోన్ల ప్రభావం వలన కూడా ఛాతీ పరిమాణం పెరుగుతుంది. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు.

వక్షోజాల పరిమాణం తగ్గించటానికి సహజ మార్గాలు..

పరిమాణం పెద్దగా ఉండే స్తనాలను తగ్గించుకోవటానికి ఇప్పుడు గైనెకోమాస్టియా, బ్రెస్ట్ లంప్ సర్జరీ వంటి పలు రకాల బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి.. అయితే సహజ మార్గాలలో సైజ్ తగ్గించుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్నవారు, తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంటే నిపుణులు సూచించిన కొన్ని మార్గాలను ఎంచుకోవచ్చు. వీటిని ప్రయత్నించడం ద్వారా వాటి సైజ్ తగ్గే అవకాశం ఉంటుంది.

గ్రీన్ టీ

బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఒక సహజ మార్గం. గ్రీన్ టీలో జీవక్రియను వేగవంతం చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది, కేలరీలను కూడా తగ్గిస్తుంది. రొమ్ములో నిల్వ ఉన్న కొవ్వును కూడా కరిగించేస్తుంది..

ఆహారం

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల ప్రభావం కారణంగా రొమ్ములు బరువుగా మారతాయట…సంతులన ఆహారాన్ని తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా వక్షోజాల కొవ్వును చాలా వరకు తగ్గించవచ్చు. పండ్లు, తాజా కూరగాయలు తినడం వల్ల కొవ్వు కరిగిపోతుంది.

ఒమేగా 3

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. అవిసె గింజలు, అక్రోట్లను లేదా చేపలను తినవచ్చు.

వ్యాయామం..

బ్రెస్ట్ సైజు తగ్గించుకోవడానికి మీరు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు కూడా చేయవచ్చు. వారానికి కనీసం నాలుగు సార్లు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. రొమ్ములను ఆకృతిలో ఉంచడానికి పుషప్‌లు మంచి మార్గం. చాప మీద మీ ఛాతీపై పడుకోండి. మీ భుజాల పక్కన అరచేతులను ఉంచడం ద్వారా మీ శరీరాన్ని విస్తరించండి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండటం లేదా సైక్లింగ్ చేయడం ద్వారా కూడా మీ ఛాతిలో కొవ్వును తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news