క్రికెట్‌లో అప్పుడప్పుడు వింతైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అది సహజమే. అయితే అంపైర్లు తప్పు చేసి దొరికిపోవడం అత్యంత అరుదుగా జరుగుతుంది. పాకిస్థాన్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ పొరపాటు చేసి దొరికిపోయాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ఇటీవలే జమైకాలోని కింగ్‌స్టన్ సబినా పార్క్‌లో జరిగింది. అందులో వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. అయితే వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో 77.1 ఓవర్ వద్ద విండీస్ ఆటగాడు బ్రాత్ వైట్ 97 పరుగులు చేసి కీలకదశలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక బంతికి అతను రనౌట్ అయ్యాడు.
అయితే ఆన్‌ఫీల్డ్‌లో ఉన్న అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా.. అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి బదులుగా విండోస్ మీడియా ప్లేయర్‌ను ఓపెన్ చేశాడు. దీంతో ఆయన ఆడియో లిస్ట్‌లో ఉన్న సాంగ్స్ క్రికెట్ మైదానంలో భారీ తెరపై కనిపించాయి. అయితే వెంటనే థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో అంతా సద్దు మణిగింది. కానీ ఆ సమయంలో తీసిన వీడియో మాత్రం వైరల్‌గా మారింది.