కేవలం రూ.291 కడితే… ప్రతీ నెలా వెయ్యి రూపాయిలు పెన్షన్ పొందొచ్చు…!

-

మీరు రిటైర్మెంట్ అయ్యిన తరువాత ఏ ఆర్ధిక ఇబ్బందులు లేకుందా ఆనందంగా జీవించాలని అనుకుంటున్నారా..? అయితే మీరు దీని కోసం తప్పక తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రెండు రకాల పెన్షన్ స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ రెండింటి వలన కూడా మంచి లాభాలు పొందొచ్చు. పైగా మీకు ఆర్ధిక ఇబ్బందులు కూడా భవిష్యత్తు లో రావు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళ్ళిపోతే..

కేంద్ర ప్రభుత్వం రెండు రకాల పెన్షన్ స్కీమ్స్ అందిస్తున్నాయి. వీటి వ్లల మంచి లాభం పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండడానికి కూడా వీలు అవుతుంది. పీఎఫ్ఆర్‌డీఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS, అటల్ పెన్షన్ యోజన APY అనే రెండు పెన్షన్ స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. దీనితో చాల మంది లాభాలని పొందడానికి కూడా కుదురుతుంది.

ఈ స్కీమ్‌లో చేరిన వారికి నెలకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ వస్తుంది. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 60 ఏళ్ల తర్వాతనే పెన్షన్ లభిస్తుంది. మీ పెన్షన్ మీరు కట్టిన డబ్బులు కూడా ఆధారపడి ఉంటుంది గమనించండి.

మీరు నెలకు రూ.1,000 పొందాలని యోచిస్తే మీరు నెలకు రూ.291 కట్టాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ఈ మొత్తాన్ని చెల్లించాలి. అదే రూ.5 వేలు పొందాలని భావిస్తే నెలకు రూ.1454 కట్టాలి గమనించండి. అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారి సంఖ్య 33 శాతం పెరుగుదలతో 2.8 కోట్లకు చేరింది.

ఈ స్కీమ్స్ లో కరోనా సమయం లో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌‌లో చేరిన వారి సంఖ్య 2021 మార్చి 31 నాటికి 23 శాతం పెరిగింది. 4.24 కోట్లకు ఎగసింది. మీరు కూడా దీనిలో జాయిన్ అవ్వాలని అనుకుంటే…. పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌ కి వెళ్లి అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను ఈజీగా ఓపెన్ చెయ్యడానికి వీలవుతుంది.

బ్యాంక్ అకౌంట్ ఉంటే సులభం గానే ఏపీవై పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కచ్చితంగా అవసరం. అయితే వీటితో మొదట సులభంగా ఖాతా తెరిస్తే అప్పుడు మంచి డబ్బులు ఈ స్కీమ్ కింద మీకు అందుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version