గ్యాస్ట్రిక్‌ సర్జరీతో 62కేజీల బరువు తగ్గిన మహిళ..

-

బరువు పెరగడం ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది..తగ్గడం అంటే కాస్త కష్టమే అని చాలా మంది అనుకుంటారు. కానీ గట్టిగా ట్రై చేస్తే కానిది అంటూ ఏదీ ఉండదు. వంద కేజీల పైన ఉన్నవారు కూడా..మూడు నాలుగు నెలల్లోనే 70కేజీలకు వచ్చిన వార్తలను మనం చూస్తూ ఉంటాం. కారణం..వాళ్లు పాటించిన డైట్, చేసిన వ్యాయామాలు. ముఖ్యంగా మహిళలు పెళ్లై పిల్లలు పుట్టాక బరువు పెరుగుతారు. ఆ స్టేజ్‌లో తగ్గాలన్నా అప్పుడన్న పరిస్థితులు వారికి అంత టైమ్‌ కూడా ఇవ్వవు. ఇలానే అమెరికాకు చెందిన ఓ మహిళ రెండో సారి గర్భిణిగా ఉన్నప్పుడు విపరీతంగా బరువు పెరిగింది.. అదే బరువు బాబు పుట్టాక కూడా కొనసాగింది..తనకు నచ్చలేదు.. ఎలా అయినా తగ్గాలనుకుంది. ఓ సర్జరీ చేయించుకుని దెబ్బకు 62 కేజీలు తగ్గింది.
అమెరికాకు చెందిన సారా లాకెట్‌.. రెండోసారి గర్భిణీగా ఉన్నప్పుడు విపరీతంగా బరువు పెరిగింది. బాబు పుట్టాక కూడా బరువు పెరుగుతూనే ఉంది. దాంతో ఆమెకు అన్ని రకాలుగా ఇబ్బందిగా అనిపించింది. ఓ రోజు దీనికి పరిష్కారం కోసం బలంగా ఆలోచించింది. డాక్టర్లను కలిసినప్పుడు.. వారు ముందుగా కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు సూచించారు. వాటిని ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. దాంతో ఆమెకు గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ (gastric sleeve surgery)ని సూచించారు.
ఈ సర్జరీ చేయించుకుంటే.. భారీగా బరువు తగ్గుతారని చెప్పడంతో.. ఆమె ఓకే చెప్పింది. దాంతో డాక్టర్లు సర్జరీ చేసి.. బాడీలో కొవ్వంతా బయటకు తీసేశారు. దాంతో.. 62 కేజీలు బరువు తగ్గింది. సర్జరీ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్‌ అయిన సారాని చూసి.. కన్న కొడుకే గుర్తుపట్టలేకపోయాడట. భయపడ్డాడు. తనే కాదు.. చుట్టుపక్కల ఇళ్లలో వారు కూడా.. ఆమెను గుర్తుపట్టలేకపోయారు. ఇలా ఎలా మారిందని షాక్ అయ్యారు. సర్జరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సర్జరీ తర్వాత సారా చాలా సంతోషంగా ఉందట.. ఇదివరకు ఎక్కడికి వెళ్లాలన్నా సిగ్గుగా, ఇబ్బందిగా ఫీలైన ఆమె.. ఇప్పుడు మోడలింగ్ చేస్తోంది. ఫొటోషూట్లకు పోజులిస్తోంది. సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 80 వేల మంది దాకా ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె ఇతరులకు ఫిట్‌నెస్ సూచనలు కూడా ఇస్తుంది. డిజిటల్ క్రియేటర్‌గా మారి.. ఫ్యాషన్ ఉత్పత్తులకు యాడ్స్, ప్రమోషన్స్ చేస్తోంది. 60 కేజీలు బరువు తగ్గిన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.
సారాకు నాలుగేళ్ల పాప, రెండేళ్ల బాబు ఉన్నారు. ఆమె అతిగా తినడం వల్ల లావు అవ్వలేదు. ఆమెకు ప్రీక్లాంప్సియా (preeclampsia), జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నాయి. వాటి వల్ల ఆమె రోజూ 3వేల కేలరీలకు పైగా ఆహారం తీసుకోవాల్సి వచ్చేదట.. దాంతో విపరీతంగా బరువు పెరిగింది.
సారాకి 2021 సెప్టెంబర్‌లో సర్జరీ జరిగింది. ఇందుకు అయిన ఖర్చులో 98 శాతాన్ని ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఆమె తిరిగి పొందింది. సర్జరీ తర్వాత ఆమెకు సైడ్ ఎఫెక్టులు కూడా ఏవీ రాలేదు. ప్రస్తుతం ఆమె మంచి జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆహారం, ఫ్యామిలీ.. అన్ని విషయాల్నీ మేనేజ్‌ చేసుకోగలుగుతుంది. సారా లాగా బరువు తగ్గాలి అనుకునేవారందరికీ గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ సెట్ అవుతుందా అంటే కచ్చితంగా చెప్పలేం. దీనిపై డాక్టర్లను సంప్రదిస్తే..మీ బాడి కండీషన్‌ను బట్టి చేయొచ్చా లేదా అనేది చెప్పగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news