బాలుడిపై కన్నేసిన ఆంటీ.. ఇంటికి పిలిచే అత్యాచారం..

రోజు రోజుకు అమ్మాయిలు, మహిళలు కూడా రెచ్చిపోతున్నారు.. కొందరు మహిళలు చేసే పనికి స్త్రీ జాతికి మాయని మచ్చలా మారుతోంది. అలాంటి ఘటనే ఇది.. తల్లి వయసున్న ముంబాయి లోని ధారావికి చెందిన ఓ ఆంటీ బీహార్ కు చెందిన 17 ఏళ్ళ యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఆ పరిచయం ముదరడంతో ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.. ఆ తరువాత నుంచి సదరు ఆంటీ ఆ యువకుడిని తన ఇంటికి రావాలని.. వచ్చి తన కామవాంఛ తీర్చాలని కోరేది.. దానికి నో చెప్పిన యువకుడు.. ఆమె నెంబర్ ను బ్లాక్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత.. సదరు బాలుడు ఉద్యోగం కోసం ముంబై లోని అతని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని మహిళ తెలుసుకుంది.

తమ ఇంటికి రావాల్సిందిగా పిలిచింది. ఆ తర్వాత.. బాలుడు మహిళ ఇంటికి వెళ్లాడు. అతడిని గదిలోకి తీసుకెళ్లి బంధించి, అత్యాచారం చేసింది. అంతే కాకుండా చెప్పినట్లు వినకపోతే.. నీపై కేసు పెడతానని బెదిరించింది. దీంతో బాలుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే అదనుగా భావించిన మహిళ.. బాలుడిని ముంబైలోని అనేక హోటళ్లలో తిప్పుతూ.. పలుమార్లు అత్యాచారం చేసింది. ఇక మహిళపై వేధింపులు భరించలేక బాలుడు ఇంట్లో వారికి జరిగిన విషయం తెలిపాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు మహిళే.. బాలుడు, అతని తండ్రి, మేనమామలు కలిసి తనను రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షాక్ కు గురైన బాలుడి కుటుంబం జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఫోన్ చాటింగ్ లను చూసి.. మహిళను కూడా అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.