ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా మందుబాబులు మాత్రం మారడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో మరోసారి చోటు చేసుకుంది. హైదరాబాద్ కొండాపూర్ మసీద్ బండలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును అతివేగంగా నడిపి బైక్ను ఢీ కొట్టారు.
అంతేకాకుండా.. సదరు యువకులను అడ్డగించిన స్థానికులపై వీరంగం సృష్టించారు. వారిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు వెంటనే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. అయితే.. ఆ ఇద్దరు యువకులు పోలీసులు సైతం లెక్కచేయకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కార్ పై ఎంపీ స్టిక్కర్ ఉంది.