ఏపీలో సెక్స్ వర్కర్లు ఎక్కువేనని కేంద్రం కీలక ప్రకటన చేసింది. అటు స్థానిక సెక్స్ కార్మికులను, ఇటు వలస కార్మికులను కలిపి లెక్కిస్తే, దేశంలోనే ఏపీలో సెక్స్ వర్కర్లు ఎక్కువేనని కేంద్రం వెల్లడించింది. హెచ్ ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికను తయారు చేసింది.
ఈ నివేదిక ప్రకారం, స్థానిక సెక్స్ కార్మికులు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షల మంది ఉన్నారు. కర్ణాటకలో 1.16 లక్షలు, తెలంగాణ లక్ష మంది ఈ పని ద్వారా పొట్ట పోసుకుంటున్నారు. ఇక, మహా రాష్ట్ర నుంచి వెళ్లి, 6.6 లక్షల వలస సెక్స్ కార్మికులు దేశ వ్యాప్తంగా జీవిస్తుంటే, తర్వాతి వరుసలో గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి.