మనిషి జీవితం వందేళ్ళ నుంచి అరవైఏళ్ళకు చేరింది.అందులో డబ్బు సంపాదన వేటలో పడి త్వరగా చనిపోతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. పెరిగిన కాలుష్యాలు,మరోవైపు ఆహరపు అలవాట్లు పూర్తిగా మారి పోవడంతో కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయి.. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మానసిక పరిస్థితి అలానే ఉంది..న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్ మరియు బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది..
ఈ వ్యాధుల గురించి అవగాహన లేకపోవటంతో ఎక్కువ మంది చనిపోతున్నారని వైద్యులు అంటున్నారు.ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవాన్ని జరుపుకుంటారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో, వెంటనే చికిత్స చేయాలి.. ఇలాంటి విషయాల పై జనాలు తేలిగ్గా తీసుకోవడం వల్ల మెదడు వ్యాధుల సంఖ్య పెరిగి చనిపోతున్నారు.
జులై 22న ప్రపంచ బ్రెయిన్ డే లేదా వరల్డ్ బ్రెయిన్ డేను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటామని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ మిశ్రా తెలిపారు. ఈ రోజున, మెదడు రుగ్మతల భారాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అవగాహన కూడా పెరుగుతుంది..అది మెదడు వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్పించెందుకు సహాయ పడుతుందని అభిప్రాయ పడుతున్నారు. మెదడుకు సంబంధించిన అన్ని వ్యాధులూ ప్రమాదకరమని, అయితే ఇందులో బ్రెయిన్ ట్యూమర్ల కేసులు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. చాలా మందికి ఉదయం లేవగానే సిక్ గా అనిపిస్తుంది..కానీ, కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు..వెంటనే వైద్యులను సంప్రదించాలి..
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక పాటించాలి..
పోషకాహారం తీసుకోవాలి..
రోజువారీ వ్యాయామం
ఒత్తిడి తీసుకోకండి
రోజూ కనీసం ఎనిమిది లేదా తొమ్మిది గంటలు నిద్ర పోవాలి..