ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ వరల్డ్ కప్ లో రెండవ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్ వరుసగా రెండు సెంచరీ లు చేశాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున వరల్డ్ కప్ లో ఇదే విధంగా వరుసగా రెండు సెంచరీలు సాధించిన వారిలో ఇతనికన్నా ముందు మార్క్ వా, రికీ పాంటింగ్, హేడెన్ లు ఉన్నారు. వీరి తర్వాత వరుసగా రెండు సెంచరీ లు చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్ గా వార్నర్ రికార్డ్ సృష్టించాడు. ఇక వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో కూడా వార్నర్ పేరు ఎక్కింది. ఇంతకు ముందు వరకు వరల్డ్ కప్ లో ఎక్కువ సెంచరీ లు చేసిన వారిలో మొదటి స్థానంలో రోహిత్ శర్మ (7), సచిన్ టెండూల్కర్ (6), రికీ పాంటింగ్ (5), సంగక్కర (5) లు ఉన్నారు.
కానీ ఈ మ్యాచ్ లో వార్నర్ సెంచరీ చేయడంతో ఆరు సెంచరీ లతో సచిన్ తో సమంగా నిలిచాడు. ఈ వరల్డ్ కప్ లో మరో సెంచరీ చేస్తే రోహిత్ తో సమంగా నిలవనున్నాడు.